
చాట్ల జాషువాపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తితో దాడి…
చింతకాని మండలం నాగిలిగొండా గ్రామంలో దారుణ ఘటన….
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి
చింతకాని మండల పరిధిలోని నాగిలిగొండా గ్రామంలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన చాట్ల జాషువాను అదే గ్రామానికి చెందిన తోటపల్లి సుమంత్ కోడి కత్తితో పొడిచినట్లు సమాచారం.
ఈ ఘటనలో జాషువాకు తీవ్ర గాయాలయ్యాయి అని తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు గాయపడిన జాషువాలో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




