
మంత్రి వాకిటికి శ్రీహరికి నిరసన సెగ..
అమరచింత మున్సిపల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి సొంత నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది.
వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పలు కాలనీల్లో రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు బుధవారం నాడు భూమి పూజ చేసేందుకు వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
త్రాగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమను పట్టించుకోని, నాయకులు ఇప్పుడెందుకు వచ్చారని నిలదీశారు.
మరికొన్ని కాలనీల్లో అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, మంత్రితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన వారి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక నెల సమయం ఇస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.




