
ఖమ్మం జిల్లా మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల: దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 6నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. 28 ఫిబ్రవరి 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.
ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.28 ఫిబ్రవరి 2026వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కొనసాగుతాయి. ఇకపోతే ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆరో తరగతిలో ప్రవేశాలతోపాటు 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ స్కూళ్లలో మిగిలి పోయిన సీట్ల భర్తీకి కూడా ప్రవేశ పరీక్ష ఉంటుంది అని తెలుస్తోంది.ఈ సీట్ల కోసం కూడా బాలికలు, బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు అని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
వెబ్‌సైట్ దరఖాస్తు
6వ తరగతిలో అన్నీ సీట్లకు ప్రవేశాలు ఉంటాయని… అలాగే 7 నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇకపోతే దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125…ఓసీ విద్యార్థులు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు https://telanganams.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ముఖ్యమైన సమాచారం
ప్రవేశాలు కల్పించే తరగతులు : 6, 7 తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ప్రారంభ తేది : జనవరి 28, 2026
దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 28, 2026
దరఖాస్తుల ఫీజు: ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి.
ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ ప్రారంభం : 03 ఏప్రిల్ 2026
వెబ్‌సైట్: https://telanganams.cgg.gov.in/
రాత పరీక్ష తేదీ : 19 ఏప్రిల్ 2026



