
రాత్రి భర్తతో గొడవ.. తెల్లవారేసరికి విగతజీవులుగా తల్లీబిడ్డలు
నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎన్ జి ఓ కాలనీ లలిత నగర్ లో శనివారం దారుణం జరిగింది. తన పిల్లలకు విషాన్ని ఇచ్చి తల్లి ఉరేసుకొని మరణించింది.
టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం …. సుధా మల్లికా (26), ఉదయ్ లకు ఐదు ఏళ్ల కిందట వివాహం అయింది. వీరు గత కొంత కాలంగా లలిత నగర్ లో నివాసముంటున్నారు. వీరికి 5 ఏళ్ల బాబు, 6 నెలల పాప ఉన్నారు.
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరేసుకొని మరణించింది. మల్లికా మృతికి కుటుంబ కలహాలే కారణంగా ప్రాథమిక విచారణలో తేలినట్లు సిఐ తెలిపారు.
ఆమెది హత్యనా.. లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సిఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా … తమ అమ్మాయిని అత్తా ఆడపడుచులు, భర్త కలిసి కొట్టి చంపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



