
సమ్మక్క సారలమ్మలను ఘోరంగా అవమానించిన టాలీవుడ్ హీరోయిన్?
Social media viral : టాలీవుడ్ లో హీరోయిన్గా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరగనుంది. తాజాగా మేడారం జాతరలో ఆమె చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పెంపుడు కుక్కకు బెల్లం దానం : మేడారం జాతరలో భక్తులు తమ బరువుకు తగ్గట్లుగా ‘బెల్లం’ దానం చేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ‘బంగారం’గా పిలుస్తారు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
తాజాగా, అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తూకంలో వేసి బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ‘మేడారం జాతర… మా లక్కీ బంగారం’ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
కొందరు టీనా చేసిన పనిని సపోర్ట్ చేస్తుండగా… మరికొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆదివాసీ దేవతలను అవమానించడమేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆమెను విమర్శిస్తున్నారు.
మరికొందరు మాత్రం పెంపుడు కుక్కను తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుని అలా చేశారని దీనిలో తప్పేముంది అంటూ సమర్థిస్తున్నారు. అయితే, టీనా తల్లి మాత్రం మొక్కులో భాగంగానే ఇలా చేసినట్లు సమర్థించుకున్నారు. మరి దీనిపై మీ స్పందన.



