
హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట ఘరానా మోసాలు..
Web desc : ఖమ్మం టౌన్ హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట ఘరానా మోసాలు.. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తమ కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మీ ఆరోగ్యానికి తగిన భరోసా కల్పిస్తూ పలు ఆరోగ్య ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్ల ద్వారా ప్రజలను పలు ప్రలోబలను గురిచేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి.
గత కొన్ని రోజుల క్రితం ఖమ్మం నగరంలోని పాండురంగాపురం అమరావతినగర్ కాలనీ చెందిన గుర్రం రమణారెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ తొంటి విరిగి బాలాజీనగర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోగా
ఆతను కట్టిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధితుడిని పట్టించుకోకపోగా అప్పు తెచ్చి డబ్బు కట్టే వరకు హాస్పిటల్ వారు డిచార్జ్ కూడా చేయలేదని లబోదిబోమన్నాడు. మంగళవారం ఆ బాధితుడు తన నివాసంలో విలేకరులతో తన బాధను వ్యక్తపరుస్తూ..
కంపెనీపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.. భవిష్యత్తులో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని తలంపుతో ఖమ్మంలోని జడ్పీ సెంటర్ లోని ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంవత్సరానికి రూ.48000 చెల్లిస్తున్నానని
కానీ అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకుండా కాలయాపన చేసి తిరిగి మా పైనే కాలు విరగాక పోయినా ఇన్స్యూరెన్స్ కోసం నటిస్తున్నారు అంటూ ఏజెంట్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
సర్జరీకి రూ.85000 అప్రూల్ ఇచ్చారని సర్జరీ అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈచ్చిన డబ్బు తిరిగి రిటర్న్ వెళ్లిందని ఆసుపత్రి వారు చెతులేత్తయడంతో చివరికి చేసేది ఏం లేక రూ.1,50,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు.
మోసం చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీ నుండి తనకు రావాల్సిన డబ్బు తిరిగి ఇప్పించాలని భాదిత కుటుంబ సభ్యులు అధికారులను కోరుకుంటున్నారు.




