
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),
జనవరి 22,
హత్య కేసులో జీవిత ఖైదీ విధిస్తూ కొత్తగూడెం ప్రధాన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
మణుగూరు కు చెందిన మహమ్మద్ మహబూబ్ బాష 25 ఆగస్టు 8 న తాను మణుగూరు పోలీస్ వారికి ఇచ్చిన ఫిర్యాదు లో తన తో కలిసి నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెళ్ల ల మీద తన తల్లి ఏం.డి.లాల్ బీ తమ పేరు మీద 12 సంవత్సరంల క్రితం డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేసినదని అవి అన్నదమ్ము లందరూ సమానంగా పంచుకోమని చెప్పగా హామీ ఇచ్చాను. అని ఫిక్స్ డిపాజిట్ ను రద్దు చేసి డబ్బులు తీసుకోగా 8 లక్షలు రాగా అట్టి డబ్బులు నలుగురం అన్నదమ్ముల పంచుకుందామని మా మూడవ అన్న మహమ్మద్ ఇబ్రహీం సుందరయ్య నగర్ మణుగూరు కు చెందిన మా అన్న మహమ్మద్ ఇబ్రహీం మాపై గొడవ చేస్తూ డబ్బులు నాకు సగం రావాలని నా ఒక్కని కే సగం వాటా ఇవ్వలేదని గొడవ పడ్డాడు అప్పటినుండి మూడవ అన్న మహమ్మద్ ఇబ్రహీం మాపై కక్ష పెంచుకొని మమ్మల్ని చంపుతానని బెదిరించే వాడు.
పార్టీ డబ్బులు సగం ఇవ్వలేదని తనతో తన భార్యతో గొడవ పడినాడని వారి అంతు చూస్తామని మిమ్మల్ని భూమి మీద బతకానివ్వన ని బెదిరించేవాడని సుమారు వారం రోజుల క్రితం కూడా ఇబ్రహీం తన ఇంటి దగ్గరికి వచ్చి బెదిరించాడని తన భార్య హబీబిబి ప్రతిరోజు ఉదయం నీటి పంపు దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొని వస్తుందని అలాగే 2020 ఆగస్టు 8 న ఉదయం 7:30 కు నీటి కొరకు వెళుచుండగా వెనుక నుండి మహమ్మద్ ఇబ్రహీం వచ్చి పొడవైన కత్తితో మెడమీద నరికి పారిపోయినాడు.
చుట్టుపక్కల వారు 108 ను పిలిపించగా వచ్చి పరీక్షించగా అక్కడే తన భార్య చనిపోయినదని ఏం.డి.ఇబ్రహీం కు సగం డబ్బులు ఇవ్వలేదని కక్ష పెంచుకొని కిరాతకంగా చంపాడని తగిన చర్య తీసుకోమని మణుగూరు పోలీసు వారికి ఫిర్యాదు చేయగా అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .ఏ. షూకూర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారని, అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. భాను ప్రకాష్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో 15 మంది సాక్షులను విచారించారు.
మహమ్మద్ ఇబ్రహీం పై నేరాభియోగము రుజువు అయినదని కోర్టు భావించి జీవిత ఖైదు రూ .1,000/- జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. పి.వి.డి. లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ప్రస్తుత మణుగూరు ఎస్. హెచ్. ఓ. పి. నాగబాబు కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎన్ .వీరబాబు,( కోర్టు డ్యూటీ ఆఫీసర్ )పిసి ఎం. అశోక్ లు సహకరించారు.




