
అన్నారుగూడెంలో దొంగల హల్ చల్
తల్లాడ, జనవరి 22 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఇల్లల్లోకి జొరపడి నగదు బంగారం వెండి ఎత్తుకెళ్లారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఏలూరు ఝాన్సీ చీకటి వెంకటేశ్వర్లు ఇల్లకు తాళాలు వేసుకొని పొలం పనుల నిమిత్తం పనికి వెళ్లారు.
ఇది గమనించిన గుర్తు తెలియని దొంగలు ఇళ్లల్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం నగదు వెండి చోరీ చేశారు. ఏలూరు ఝాన్సీ ఇంట్లో 4 తులాల చంద్రహారం 70 వేల నగదు 15 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు.
చీకటి వెంకటేశ్వర్లు ఇంట్లో వెండి గిన్నెలు దొంగిలించారు. స్థానికుల సమాచారంతో తల్లాడ పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.




