
రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్కలో వేస్తాం
పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తాము అంటూ హెచ్చరించారు హరీష్ రావు. ఇవాళ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్ ను విచారించనున్నారు.
ఈ తరుణంలోనే పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కావాలని రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులతో SIT ఏర్పాటు చేసి మామల్ని ఇబ్బంది పెడుతున్నారని సీరియస్ అయ్యారు.
ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, మీ సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు.
అటు సిట్ విచారణకు హాజరయ్యేముందు తెలంగాణ భవన్లో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
గత పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశానని ప్రకటించారు. మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశామన్నారు.
మేము ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదని వివరించారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదని గుర్తు చేశారు.



