KhammamPoliticalSPORTSTelangana

25 న ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్.

25 న ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్.

25 న ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్.

8 రాష్ట్రాల నుంచి హాజరుకానున్న సీనియర్ మహిళ క్రికెటర్లు..

ఈనెల 25 న ఖమ్మంలో సీనియర్ ఉమెన్ టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభo.

ఖమ్మంలో క్రికెట్ క్రీడాభిమానులను ఆలరించనున్న ఇందిరాగాంధీ ఐదవ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్..

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం

జాతీయస్థాయి మహిళ క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మం జిల్లాలో నిర్వహించుకోవడం తెలంగాణ సంప్రదాయంగా పరిడవిల్లుతోందని
ఈనెల 25వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏడు రోజులపాటు జాతీయస్థాయి ఇందిరాగాంధీ 5వ సీనియర్ ఉమెన్ టి-20క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ లో సీనియర్ మహిళా క్రీడా మణులు 08 రాష్ట్రాల నుంచి హాజరు కాబోతున్నారని, ఐ.ఎన్ టీ యూ సి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, ప్రముఖ టోర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ మతిన్, ఆల్ ఇండియా ఉమెన్ టి 20 క్రికెట్ అసోసియేషన్ (ఏ డబ్ల్యు టి సి ఏ ) డైరెక్టర్ సందీప్ ఆర్య లు అన్నారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం క్రికెట్ నెట్ మైదాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

*మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ మైదానం ఇప్పటికే ముస్తాబు అయిందని వారన్నారు.

ఇప్పటికే క్రీడా పోటీల నిర్వహణ కోసం పలువురు దాతలు ముందుకు రావడం శుభ సూచికం అని, వారికి త తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇందిరాగాంధీ 5 వ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ లో భాగంగా వీక్షకుల కోసం డి.ఎన్. బి. న్యూస్ ఆధ్వర్యంలో నాలుగు కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలు ఉండబోతున్నాయన్నారు.
ఈ టోర్నమెంట్లో 8 రాష్ట్రాల నుంచి సీనియర్ మహిళ క్రీడామణులు పాల్గొన నున్నారని చెప్పారు. , ఢిల్లీ, ఉత్తర్ఖండ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాల సీనియర్ మహిళా క్రీడామణులు హాజరుకానున్నారన్నారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరం లో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ టోర్నమెంట్ జరగడం రాష్ట్ర నికి గర్వ కారణం అన్నారు మహిళా లు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాదించాలి అన్న రు. క్రికెట్ క్రీడా లో అపార అనుభవం కలిగిన మహమ్మద్ మతీన్ నేతృత్వంలో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణలో చాకచక్యంగా క్రీడా పోటీలను విజయ పదంలో నడిపి, అపార అనుభవంతో ఈ క్రీడా పోటీలను మతీన్ జరుపనున్నారని పేర్కొన్నారు.

మహిళా క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో మహిళ ఎంపైర్లతోనే క్రికెట్ క్రీడా పోటీల నిర్వహణ ఉండబోతుందన్నారు. మహిళా క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఖమ్మంలో క్రికెట్ క్రీడాభిమానులను ఇందిరాగాంధీ 5 వ సీనియర్ ఉమెన్ టి20 క్రికెట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2026 టోర్నమెంట్ అలరించబోతుందన్నారు. అనంతరం టోర్నమెంట్ బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, మాజీ ఉర్దూగర్ షాది ఖానా చైర్మన్ షేక్. మజీద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఫరీద్ ఖాద్రి, సీనియర్ క్రీడాకారుడు ఖాజా, ఇందిరా ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ సిరంశెట్టి వేణు, మహిళా సీనియర్ క్రీడాకారిణి సుభద్ర, పి శ్రీలక్ష్మి, ఆర్గనైజర్లు వీరేందర్, సిద్దు, నాగేశ్వరరావు, అఫిషియల్ అంపైర్స్ నైనా, ప్రియ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button