
మునుగోడులో టెన్షన్ టెన్షన్..! ముదురుతున్న వైన్ షాపుల వివాదం
ఎమ్మెల్యే చెప్పిన టైంకే వైన్ షాప్స్ ఓపెన్ చేయ్యాలని కాంగ్రెస్ నేతల వీరంగం
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన టైమింగ్స్ మేరకే మద్యం దుకాణాలు నడుపాలని వైన్ షాప్ యాజమానులు,
ఎక్సైజ్ అధికారులతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూర్ మండల కేంద్రాల్లో వైన్స్ షాప్స్ ముందు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒకటి తర్వాతనే వైన్సులు తెరవాలని మద్యం దుకాణాల యజమానులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
సంస్థాన్ నారాయణపూర్‌లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు శుక్రవారం దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి




