
గ్రామాభివృద్ధికి మరో ముందడుగు…
సూర్య తండాలో సిసి రోడ్ పనులకు శ్రీకారం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 24 2026:మండల పరిధిలోని సూర్య తండా గ్రామపంచాయతీలో గ్రామ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సిసి రోడ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ధరావతు రామకోటి నాయక్, ఉప సర్పంచ్ బచ్చల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సారథ్యంలో సూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలో మిగిలిన అన్ని గ్రావెల్ రోడ్లను దశలవారీగా సిసి రోడ్లుగా అభివృద్ధి చేసి, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సిసి రోడ్ నిర్మాణం పూర్తయ్యే సరికి గ్రామ ప్రజలకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని, దీని ద్వారా గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు తెలిపారు.
గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తూ, పాలకవర్గానికి అండగా నిలుస్తున్న గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




