
ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామంలో విషాద ఘటన…
కరెంట్ షాక్తో యువకుడు మృతి
సి కె న్యూస్ ఏన్కూరు
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది.
కేసుపల్లి గ్రామానికి చెందిన కొలిశెట్టి సాంబ (28) అనే యువకుడు కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటన ఈరోజు కలకలం రేపింది. సాంబ తన పొలం వద్ద పనులు చేసుకుంటున్న సమయంలో అనుకోకుండా విద్యుత్ తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
అక్కడికక్కడే అతడికి బలమైన కరెంట్ షాక్ తగలడంతో కుప్పకూలిపోయాడు. సమీపంలో ఉన్న రైతులు, గ్రామస్తులు వెంటనే గమనించి సాంబను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిసింది.
సాంబ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. యువకుడు అకాల మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.



