NotificationPoliticalTelangana

తెలంగాణలో మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మోగిన మున్సిపల్‌ ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని… 13న ఎన్నికల కౌంటింగ్ జరగనుందని తెలిపారు. జనవరి 27 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది అని పేర్కొన్నారు.

ఇకపోతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఓటు హక్కు వినియోగించు కోనున్నారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముది పేర్కొన్నారు.

ఫిబ్రవరి 11న పోలింగ్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 116 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

ఈ ప్రకటనతో, ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణ జనవరి 28న ప్రారంభమవుతుంది. జనవరి 30 వరకు కొనసాగుతుంది. జనవరి 31న నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడుతుంది. అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించబడుతుంది. ఫలితాలు ఫిబ్రవరి 13న ప్రకటించబడతాయి.

ఓటు వేయనున్న 52.43 లక్షల మంది
ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 7 కార్పొరేషన్లలో మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి కుముదిని పేర్కొన్నారు.

ఇకపోతే ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత కల్పించబడుతుందని తెలిపారు.
నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

నోటిఫికేషన్ విడుదల: 28-01-2026

నామినేషన్ల స్వీకరణ: 28.-01-2026

నామినేషన్ల దాఖలుకు చివరి తేది:30-01-2026

నామినేషన్ల పరిశీలన:31-01-2026

నామినేషన్లపై అభ్యంతరాలు:01-02-2026

అభ్యంతరాలపై పరిష్కారం:02-02-2026

నామినేషన్ల ఉపసంహరణ గడువు:03.02-2026

బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల:03-02-2026

పోలింగ్: 11-02-2026

రీపోలింగ్- 12-02-2026

కౌంటింగ్:13-02-2026 (ఉదయం 8 గంటల నుండి)

సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు
మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఈనెల 28న నోటిఫికేష్ విడుదల కావడం అదే రోజు నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాయి.

మరోవైపు బీజేపీ సైతం పట్టుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇక తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button