
మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం
లంబాడీల ఐక్య వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్
రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉండగా, ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.14 (తేదీ: 13-01-2026) ప్రకారం STలకు కేవలం 5 చైర్మన్ పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది కానీ రావాల్సినవి 7 చైర్మన్ లు అని తెలియజేసారు
మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులు ఉండగా, అధికారిక Annexure ప్రకారం STలకు 180 వార్డులు కేటాయించారు ఇది 6 శాతం.
2011 జనగణన ప్రకారం ST జనాభా వార్డుల్లో 5.8% శాతం,
చైర్మన్ పోస్టుల్లో కేవలం 4.13 శాతం మాత్రమే ఇవ్వడం సరి అయినది కాదు రావాల్సిన వాట ప్రకారం 7 చైర్మన్ లు రావాల్సిన అవసరం ఉంది అని తెలియ చేశారు
ప్రభుత్వం లో ఉన్న గిరిజన నాయకులు అనగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు దీని కి బాధ్యత వహించాలి లేకుంటే జాతి ద్రోహులు గా మిగులుతారు అని హెచ్చరించారు.



