
కేసీఆర్‌కు నోటీసులు.. భగ్గుమన్న ఓయూ
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ నేతలు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్ధి నాయకులు నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మాజీ సీఎం, ఉద్యమ నేత కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ ప్రజలకు ఇవ్వటమే అని ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేతలు సిట్‌పై మండిపడ్డారు.
తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని వ్యక్తి కేసీఆర్.. అలాంటి వ్యక్తిని రాజకీయ లబ్ధి కోసం సిట్ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, పడాల సతీష్, చటారి దశరత్, జంగయ్య, నాగారం ప్రశాంత్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్, అవినాష్, సాయి గౌడ్, బోయపల్లి నాగరాజు, మేడి పవన్, రాకేష్, తదితర విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.



