
నిరుద్యోగులకు శుభవార్త… 2273 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, CA వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమై ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది.
ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 97 పోస్టులు, తెలంగాణకు 80 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు తమకు చెందిన సర్కిల్‌లోనే అప్లై చేయాలి. ఒకసారి ఎంపికైతే, ఆ సర్కిల్‌లోనే సేవలందించాల్సి ఉంటుంది.
వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థి వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, OBC, PwBD వంటి రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది.
SBI లో వారికి అదనపు ప్రాధాన్యం.. విద్యార్హతగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది.
ఇంజినీరింగ్, మెడికల్, CA, కాస్ట్ అకౌంటెంట్ వంటి ప్రొఫెషనల్ అర్హతలు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా రాత పరీక్ష, ఆ తర్వాత స్క్రీనింగ్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. అయితే SC, ST, PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: sbi.bank.in బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతభత్యాలు కోరుకునే అభ్యర్థులకు ఈ SBI CBO నోటిఫికేషన్ ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 18 చివరి తేదీ కావడంతో, ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.




