పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి….
ప్రధానాచార్య బండిరాజుల శంకర్
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 03
వృత్తులన్నింటిలోను ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైందని శ్రీ రామకృష్ణ విద్యాలయ ప్రధానాచార్య బండిరాజుల శంకర్ అన్నారు. శనివారం రోజున విద్యాలయంలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను ఎవరిని తయారు చేయాలన్నా ఉపాధ్యాయులే కీలకమని ఆయన అన్నారు.విద్యార్థులు శ్రద్ధాసక్తులతో శ్రమిస్తే విజయం సాధించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులను అభినందించారు.ప్రధానోపాధ్యాయినిగా సీస హాసిని, ఎంఇఓ గా ఆలేటి రేవంత్, డిఇఓ గా జెట్ట మణిదీప్,డిప్యూటి ఇఓ గా గందమల్ల గౌతమ్, కలెక్టర్ గా పస్తం సంజయ్, డిప్యూటి కలెక్టర్ గా ఆరె మహేశ్, ఎంఎల్యే గా గ్యార నిఖిల్, మంత్రిగా మాలోతు సందీప్, డాక్టర్లుగా పత్తి నంద కిశోర్, తునికి సాహితి, మంగ హంసిక, ఎంపి గా కంకల రేఖాశ్రీతో పాటు వివిధ విషయాలను బోధించే ఉపాధ్యాయులుగా విద్యార్థులు తమ తమ విధులను చక్కగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు..ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తరిగొప్పుల రమేశ్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, పెండెం విజయ భవాని, అప్పాల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యెనగందుల కవిత, యానాల సరస్వతి, గుండు లలిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని పాల్గొన్నారు.