మైనార్టీ బాలికల గురుకులానికి స్వంత భవనం నిర్మించాలి
ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 06
మంగళవారం రోజున ఆలేరు పట్టణంలో ఉన్న మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మైనార్టీ గురుకులానికి వెంటనే సొంత భవనం నిర్మించాలని ఈ గురుకుల పాఠశాలలో రేకుల షెడ్డులో విద్యాబోధన చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు
ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ విద్యారంగంలో విద్యార్థుల కు కావలసిన కనీస అవసరాలు అయినా బోధన ఆలయాలను నిర్మించడంలో నిర్లక్ష్య వహిస్తుందని అన్నారు అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని కనీస వేతన చట్టం ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని వారికి పర్మినెంట్ ఉద్యోగస్తుల గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు
అదేవిధంగా గురుకులంలో ఉన్న విద్యార్థులకు మిస్ చార్జీలు 35 రూపాయలుగా చెల్లిస్తున్నారని ఇంత తక్కువ మెస్ ఛార్జీతో విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం అసాధ్యమని అన్నారు.
కనీసం 6 నుండి 7వ తరగతి వరకు 50 రూపాయలు మెస్ చార్జీ ఇవ్వాలని అదేవిధంగా 7 నుండి 10 తరగతి విద్యార్థులకు 70 రూపాయలు మెస్ ఛార్జి చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యా అందించడంలో గురుకులాలు ముందు ఉంటాయని ఈ గురుకులాలకు మంచి సదుపాయాలు కూడినటువంటి భవనాలు నిర్మించడం లో ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం ఏ ఇక్బాల్ సిపిఎం పట్టణ నాయకులు మొరీగాడి రమేష్ తాళ్లపల్లి గణేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కాసుల నరేష్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చేన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు