టార్గెట్ కెసిఆర్ ?
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే.. ఆపరేషన్ కేసీఆర్ మొదలుపెట్టింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటికి సంబంధించిన నిజానిజాలు బయటపెట్టే పనిలో పడింది.
మొదట విద్యుత్ శాఖతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేత పత్రం విడుదల చేశారు.
కాగా.. ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో, కాళేశ్వరం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. ఆపరేషన్ కేసీఆర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో హరితహారం ముఖ్యమైనది. కాగా.. తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది కేసీఆర్ సర్కార్.
అయితే.. తొమ్మిది విడతల్లో ఈ హరితహారం కార్యక్ర మాన్ని చేపట్టిన ప్రభుత్వం.. భారీగానే ఖర్చు చేసింది. అయితే.. ఈ కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అనుమాలు వ్యక్తం చేస్తుంది
కాంగ్రెస్. అయితే.. ఇప్పుడు హరిత హారంపై ఫోకస్ చేసిన రేవంత్ రెడ్డి.. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై చర్చించినట్టు సమాచారం. గత సర్కారు హరితహారంపై చేసిన ఖర్చు, పెరిగిన అటవీ ప్రాంత విస్తీర్ణం లెక్కలు బయటకు తీయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.