
వ్యాయామం చేస్తూ హార్ట్ఎటాక్తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
Web desc : వ్యాయామం చేస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది.
జిమ్ సిబ్బంది కథనం ప్రకారం.. ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
రోజూలాగే బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న ‘ఏసిబో జిమ్’కు వ్యాయామం కోసం వెళ్లారు. కాసేపు వర్కౌట్స్ చేసిన తర్వాత అనిల్ చౌదరి వాష్‌రూమ్‌కు వెళ్లారు.
అయితే అక్కడ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్ప కూలిపోయారు. గమనించిన జిమ్ సిబ్బంది, తోటి సభ్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
పరిస్థితి విషమించడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనిల్‌ను పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు.



