ప్రయివేట్ పాఠశాల బస్సులపై ప్రత్యేక డ్రైవ్.
స్కూల్ బస్సులను కచ్చితంగా ఫిట్ నెస్ చేయించుకోవాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ వెల్లడి.
ఫిబ్రవరి:9 శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ( సి.కె న్యూస్ ప్రతినిధి)
షాద్ నగర్ నియోజకవర్గం లోని ప్రయివేట్ స్కూల్ బస్సులను కచ్చితంగా ఫిట్ నెస్ చేయించుకోవాలని సూచించారు షాద్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్.
ఒకవైపు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రయివేట్ పాఠశాలల వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్.ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో రోజు ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం పట్టణంలోని మరియా రాణి, శాంతి విద్యా నీకేతన్,ఆక్సఫర్డ్ పాఠశాలలో బస్సులపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా బస్సులకు సంబంధించిన పత్రాలను, ఫిట్నెస్, సేఫ్టీ మెజర్మెంట్స్ లను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ,,బస్సులకు కూడా వేంటనే ఫిట్ నెస్ చేయించుకోవాలని.లేని పక్షంలో తమ శాఖ తనిఖీలు నిర్వహించే సమయంలో ఫిట్ నెస్ లేని వాహనాలు జప్తు చేయబడతాయని అన్నారు.ముఖ్యంగా ప్రయివేట్ పాఠశాలల బస్సులు నడిపే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.
అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రైవింగ్ పై ప్రత్యేక అవగాహనా నిర్వహించడం జరిగింది.ఈ అవగాహనా కార్యక్రమాలలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్.,కమల, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి, శాంతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ అలెగ్జాండర్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్ కరస్పాండెంట్ రిజ్వాన్, ప్రత్యేక అధికారి,ట్రాఫిక్ సిబ్బంది నరసింహ గౌడ్, వెంకట్ రెడ్డి, యాదయ్య, మరియు ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్స్, తదితరులు ఉన్నారు…