KhammamPoliticalTelangana

ఆడపిల్లల ఆరోగ్యం కోసం టీకా

ఆడపిల్లల ఆరోగ్యం కోసం టీకా

ఆడపిల్లల ఆరోగ్యం కోసం టీకా

ఏన్కూరు పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 24 2026: ఏన్కూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా కార్యక్రమాన్ని వైద్య అధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ, డాక్టర్ ఎం. నాగమణి సమక్షంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా బాలికలు మరియు మహిళలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

వైద్యుల సూచనల ప్రకారం 9 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ టీకా తీసుకోవచ్చుని. ముఖ్యంగా చిన్న వయస్సులోనే టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చుని.

ప్రభుత్వం 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ఇదే సమయంలో భద్రుతండా తిమ్మారావుపేట ప్రాంతంలో టీకాపై అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోందని.

అక్కడి ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకు రాకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టీకా ఖర్చు సుమారు రూ.4000 వరకు ఉండగా, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ స్పందన తగ్గడం గమనార్హం.

అపోహలు, భయాలు ప్రజలను వెనక్కి నెడుతున్నాయని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ముందుకు వచ్చి ఆడపిల్లలు టీకా వేయించుకునేలా చొరవ చూపాలని వైద్యాధికారులు కోరారు.

గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు అపోహలను పక్కనపెట్టి తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టీకాను వినియోగించుకోవాలని వైద్యులు పిలుపునిస్తున్నారు.

ఉచితంగా లభిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button