
మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై
మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో ఓ ఎస్సై మోసం చేశాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.అంతేకాక ఉన్నతాధికారులు సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
2018 బ్యాచ్‌కు చెందిన ఎస్సీ.సురేశ్ కుమార్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నాడు. అతడికి హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
పెళ్లి చేసుకుంటానని హమీ ఇవ్వడంతో సురేశ్‌కు యువతి మరింత దగ్గరైంది. కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంపై యువతి ఒత్తిడి చేసింది. అయితే సురేశ్ ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇటీవల పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
ఎస్సై సురేశ్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానం వచ్చి.. మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెపై ఎస్సై సురేశ్ ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు.
దీంతో అతనిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సురేశ్‌ను విచారించడానికి ప్రయత్నించారు. అయితే సురేశ్ తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో బాధిత యువతి ఇచ్చిన ఆధారాలతో పోలీస్ ఉన్నతాధికారులు అతణ్ని సస్పెండ్ చేశారు




