పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలు అందించిన సిఎం రేవంత్ రెడ్డి
సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్
ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్
నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నం.
ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు.
మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు…
అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నాం
న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నాం..
13,444 మంది ఉద్యోగులకు ఇవాళ నియామక పత్రాలు అందిస్తున్నాం.
ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటా..
ఈ ప్రభుత్వం మీది.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం
ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నాం..
నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసాం.
మాట ఇచ్చినట్టుగానే 15 రోజుల్లో కానిస్టేబుల్స్ కు నియామకపత్రాలు అందిస్తున్నాం..
కేసీఆర్ తన బంధువులకు, కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోయారు.
కానీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు.
తెలంగాణ సమాజం నిన్ను బహిష్కరించిందని ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా కేసీఆర్..
ప్రజలు బండకేసి కొట్టారని ఇప్పటికైనా తెలుసుకోండి..
నిన్న నల్లగొండ వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతుండు…
పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని అంటుండు..
ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారు..
ఏ రేసుకు వెళ్లినా గుర్రాలదే గెలుపు…
కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుంది.
నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు… చచ్చిన పామును ఎవరైనా చంపుతారా..
కేసీఆర్ నీ పని అయిపోయింది.. ఖేల్ ఖతం దుఖాన్ బంద్..
ఏ తప్పు లేకుండా.. ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..
పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయసు 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం.
మీ ఆశీర్వాదం ఉంటే పదేళ్లు కాదు 20ఏళ్లు ప్రజా ప్రభుత్వం ఉంటుంది..
కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్..
గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మనకు రావాల్సిన నీటిని రాకుండా చేశారు.
కేసీఆర్ సంతకం తెలంగాణ రైతులకు గుదిబండగా మారింది.
ఒక్క సంతకంతో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.
అది మేడిగడ్డ కాదు.. మేడిపండు..
పొట్ట విప్పితే పురుగులు బయటపడతాయనే నల్లగొండలో సభ పెట్టారు.
తెలంగాణను కబలించడానికి గంజాయి , డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయి..
గంజాయి ముఠాను కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉంది.
తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదు..