మేడారం డ్యూటీ పేరు చెబుతూ మండలాలలో పలు శాఖల అధికారులు జల్సా.!
“మేడారం జాతర దర్శనానికి వచ్చేవాళ్లేనా సమస్యలు.! మండల ప్రజలవి సమస్యలు కావా.?”
“మేడారం ముచ్చట్లు పడి, అధికారులపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం”
“అత్తగారింటికి వచ్చి వెళుతున్నట్టుగా అధికారుల వీధుల నిర్వహణ”
“కాలక్షేపన కోసమే కారులలో అధికారుల తిరుగుడు”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో మేడారం జాతర పేరు చెబుతూ కాలక్షేపం చేస్తున్న మండల అధికారులు. ఆడింది ఆట పాడింది పాట గా మారుతున్న అధికారుల తీరు.
పలు రకాల సమాచారం కోసం ప్రజలు అధికారులను సంప్రదించేందుకు మండల కార్యాలయాలకు వెళ్తే, బాధితులకు అధికారుల ఖాళీ గూర్చి దర్శనమిస్తుంది. అధికారులు ఎప్పుడు వస్తారని అక్కడ ఉన్న సిబ్బందిని బాధితులు ప్రశ్నిస్తే” అక్కడి సిబ్బంది చెప్పే సమాధానం, బాధితులకు ఇబ్బందికరంగా మారుతుంది.
అధికారుల రాక గూర్చి ఎదురుచూసే బాధితులు. మండల కార్యాలయాలలో ఎక్కువైపోయారు. టైం 11 :00 అవుతున్న మండల పలు శాఖల అధికారులు మండల కార్యాలయానికి చేరుకొకపోగా, కార్యాలయానికి వచ్చాక వారు చెప్పే సమాధానం” బాధితులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మేడారం జాతర సమీపంలో ఉన్నందున జాతరలో పలు రకాల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో మాకు స్పెషల్ డ్యూటీలు పడ్డాయి అంటూ, మేడారం జాతర పేరు చెబుతూ మండల అధికారులు పబ్బం గడిపేస్తున్నారు.
అసలే డిజిటల్ ఇండియా పేరుతో రోజు రోజుకి ఆన్లైన్ అప్లికేషన్లతో విసుకు చెందిన జనం అధికారుల ప్రవర్తనను. మరియు వారి మాట తీరుతో విసుగు చెందిన బాధితులు, ప్రభుత్వం ద్వారా వచ్చే పలు పథకాలకు నోచుకోలేక విరమిస్తున్నారు.
ఇలాంటి అవకాశాలను మండల పలు శాఖల కార్యాలయాలలో మండల కార్యాలయం సిబ్బంది, ఇదే అదునుగా భావించి బాధితులకు కల్లబొల్లి మాటలు చెబుతూ జేబులు నింపుకుంటున్నారు. సంబంధిత అధికారులు మండల ప్రజల సమస్యల పట్ల శ్రద్ధ చూపాలంటు బాధితులు పలు మండలాలలో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.