గంజాయి మత్తులో కత్తితో దాడి
ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
సికె న్యూస్ ప్రతినిధి
నిజామాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కత్తిపోట్లు జరిగాయి. ఎల్లమ్మగుట్ట కమాన్ వద్ద ఉండే గౌస్ పాషా ఆలియాస్ బాబన్ని అనే వ్యక్తిని అజయ్ అనే వ్యక్తి కత్తిపొడిచారు. ఈ సంఘటన ఎల్లమ్మగుట్ట కమాన్ వద్ద గల కిరాణా షాపు ప్రాంతంలో జరిగింది.
నగరంలోని 3వ టౌన్ ప్రాంతానికి చెందిన అజయ్ గత కొంత కాలంగా తన తల్లితో పాటు నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల ఎటిఎం దగ్గర నిరాశ్రయుడిగా ఉన్నట్లు సమాచారం. సాయంత్రం ఏం జరిగిందో తెలియదు కానీ ఓ కిరాణా షాప్ వద్ద తన పక్కకు కూర్చున్న బాబన్నిపై గంజాయి మత్తులో దాడికి దిగాడు.
ఈ సంఘటనలో బాబన్నీ కడుపులో నుంచి పేగులు బయటకు రాగా అతన్ని హుటాహుటిన జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ అక్కడి నుంచి పరారీ అయ్యారు. నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.