బిఆర్ఎస్ హయంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడి మునుపెన్నడూ జరగలేదు…
కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపలేం.. నిరుపయోగం మంత్రి ఉత్తమ్
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడి మునుపెన్నడూ జరగలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కీలకమైందని వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ కుప్పకూలిపోయే స్థితికి వచ్చిందని చెప్పారు.
పిల్లర్ 21 దయనీయంగా ఉందని చెప్పారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ ను రూ. 18 వందల కోట్లకు పిలిచారని అయ్యిందని కానీ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు దాన్ని రూ. 4 వేల 500 కోట్లకు పెంచారని చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని నిర్మాణలోపాల వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కాళేశ్వరం పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
2018లో ఈ బ్యారేజ్ పనులు పూర్తియైతే ఒక్కసారి కూడా ఇన్సపెక్షన్ జరగలేదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. అందరూ చూస్తుండగానే బ్యారేజ్ కూలిపోవడానికి వచ్చిందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందని చెప్పారు.
అన్నారం బ్యారేజ్ లో కూడా శుక్రవారం నుంచి లీకేజీ ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు డ్యాం సేఫ్టీ అథారిటీకి చెబితే బ్యారేజ్ లో నీళ్లు కాలీ చేయించండని చెప్పారని తెలిపారు. అన్నారం బ్యారేజి కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం పై విజిలెన్స్ ఎన్కైరీకి ఇచ్చామని చెప్పారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 81 వేలు ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ 0.75 శాతం ఉండేదని కానీ 1 లక్ష 47 వేల కోట్లు ఖర్చు చేయడంతో బెనిఫిట్ కాస్ట్ 0.52 శాతానికి పడిపోయిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న పంపుల రోజు నడిస్తే 203 మిలియన్స్ యూనిట్ల కరెంట్ కావాలని అన్నారు. మొత్తం తెలంగాణకు వాడుతున్న కరెంట్ 196 మిలియన్ యూనిట్స్ మాత్రమే అని చెప్పారు.
రాష్ట్రం కన్జూమ్ చేసే కరెంట్ కన్న కాళేశ్వరం వాడే కరెంట్ ఎక్కువ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు నడిచినస్తే వచ్చే కరెంట్ బిల్లు రూ.10 వేల 374 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వకముందే 25 వేల కోట్లు కాంట్రక్టులకు టెండర్లు పిలిచారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మలన్న సాగర్ అని కానీ అది చిన్నపాటి భూకంపం వచ్చిన కొట్టుకపోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.