MuluguPoliticalTelangana

మేడారం జాతరలో మద్యం సిండికేట్ చేతికి పగ్గాలు

మేడారం జాతరలో మద్యం సిండికేట్ చేతికి పగ్గాలు

మేడారం జాతరలో మద్యం సిండికేట్ చేతికి పగ్గాలు

“ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటే ఫలితం ఇదేనా.?”

“అందరికీ తెలిసే చేస్తున్నాం.! అందరికీ ఇచ్చే నడిపిస్తున్నాం.? అన్నట్టుగా మద్యం బాబుల పని తీరు”

“మద్యం అధిక రేట్ల మేనో తో ప్రభుత్వానికే సవాల్ విసురుతున్న వైన్స్ యాజమాన్యం”

“అంతా తెలిసి కూడా తమకేమి తెలియదు అన్నట్టుగా జాతర సమూహంలో దాటేస్తున్న జిల్లా అధికారులు”

“పాత్రికేయులను జాతరకు ముందే బుజ్జగించేందుకు పెద్ద ఎత్తునే సన్నాహాలు”

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క – సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జాతర నిమిత్తం పొట్ట చేత పట్టుకొని ఇల్లు, వాడ, గొడ్డు, వాకిలి, వదిలేసి దూర ప్రాంతాల నుంచి అమ్మవారి ఆశీస్సులతో నాలుగు రోజులు జీవనం కొనసాగించేందుకు చిరు వ్యాపారస్తులు సంబరపడితే” మేడారం జాతరలో అక్రమ సంపాదనకి అడ్డంగా అలవాటు పడ్డ వ్యాపారస్తుల తాకిడికి తట్టుకోలేక లబోదిబోమంటున్నా, చిరు వ్యాపారస్తులు. ఒకటి కాదు.! రెండు కాదు.!

కరెంటు పేరుతో, భూమి పేరుతో, కర్ర పేరుతో, పంచాయతీ పన్నులతో, మేడారం జాతర ప్రాంగణం మొత్తం డబ్బుల మోత మోగుతుంది. సమ్మక్క – సారలమ్మను దర్శించుకునేందుకు ప్రయాసపడి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్త జనాలు నిలువెత్తు బంగారం తీసుకొచ్చిన, నిమ్మకాయ అంత ప్రసాదం కూడా చేతికి రావట్లేదని భక్తులు వాపోతున్న ప్రస్తుత పరిస్థితులు.

గత కాలంలో గిరిజన గూడాలలో గిరిజన బిడ్డలంతా కలిసి డప్పుల మూతతో, సన్నాయి మేళాలతో ఆదివాసి శ్రేష్టమైన పద్ధతులతో పసుపు కుంకుమలతో పేదింటి తొలిపంటతో దంపుడు బియ్యంతో సమ్మక్క సారలమ్మకు ఒడి బియ్యం కట్టి, సంబరంగా తమ ఇంటి పండుగగా జరుపుకునే మేడారం జాతరను, నేడు ఆధునిక కాలం పేరుతో పంచభూతాల నడుమ జరిగే గిరిజన జాతరను; గిరిజన సాంప్రదాయాలను పంచ తునకాలుగా చేస్తున్న ప్రస్తుత పాలకులు. బెల్లం టెండర్ అని, కొబ్బరికాయ టెండర్ అని, మద్యం టెండర్ అని, గుడికే టెండర్ పెడుతున్న గుడి దొంగలు.

ప్రజలను పాలించేందుకు పరిపాలనలో ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వాలచే ప్రజలకు లాభం మంత్రం అంతా సున్నాయే” బాధించే ప్రభుత్వాలు కాకుండా సమాంతర పాలనను పాలించే ప్రభుత్వాలు వచ్చిన రోజే సామాన్యుడికి కూడా న్యాయం జరుగుద్ది అంటూ, మేడారం జాతర ప్రాంగణంలో భక్తులు వేడుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button