గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
జాయింట్ కలెక్టర్, డీఎస్పీల స్థాయి పోస్టులను గ్రూప్ – 1 ద్వారా భర్తీ చేస్తుంటారు. దీనికి సంబంధిన నోటిఫికేషన్లు రిలీజ్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో క్యాన్సల్ అవుతుంటాయి. ఇటీవల తెలంగాణ గ్రూప్ – 1 పరీక్షల విషయంలో జరిగిన రగడ గురించి అందరికీ తెలిసిందే.
గ్రూప్ -1 నోటిఫికేష్ రద్దు కూడా చేశారు. దీంతో గ్రూప్ -1 కి పిప్రేర్ అవుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రూప్-1 విషయంలో టీఎస్పిఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ – 1 విషయంలో అవకతవకలు జరిగాయని నోటిఫికేషన్ రద్దు చేసింది. 2022 లో 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని ఆసక్తికర పరిణామాల వల్ల రెండు సార్లు గ్రూప్ – 1 రద్దైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం గ్రూప్ – 1 కొత్త నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.
563 పోస్టులకు టీఎస్పీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.
ఇప్పటికే గ్రూప్ – 1 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కొత్త నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మే లేదా జూన్ నెలలో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెబంబర్ లేదా అక్టోబర్ నెలలో మెయిన్స్ పరీక్ష జరగనున్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. మొన్నటి వరకు గ్రూప్ – 1 పరీక్షల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ విషయం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అంటున్నారు.