బాషా నైపుణ్యం పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన కొలనుపాక విద్యార్థులు
విద్యార్థులను అభినందించిన పలువురు నాయకులు
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 20
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్పెల్ విజార్డ్, ఆంగ్ల భాషా నైపుణ్య డ్రామా పోటీలు సోమవారం నల్లగొండలో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య తెలిపారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్పెల్ విజార్డ్, డ్రామా పోటీలు నిర్వహించగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వి. రక్షిత, ఎన్. దీపిక, ఎన్. రుచిత, డి. సాహితి మరియు టి. శ్రావణి లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డ్రామా పోటీల్లో మొదటి బహుమతిని అందుకున్నారు.
ఈనెల 25 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, ఎస్ ఎం సి చైర్మన్ రాజబోయిన కొండల్, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, కొలనుపాక, మరియు పరిసర గ్రామాల తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.