లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ ఏఈ
మేళ్లచెరువు మండలంలో పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకెళితే మేళ్లచెరువు మండలం కప్పల కుంట తండా గ్రామ పంచాయతీకి సంబంధించి వీధిలైట్లగాను సుమారు రూ.2,60,000 బిల్లు చేసేందుకు గత కొంత కాలంగా లంచం ఇవ్వాలంటూ అనేక ఇబ్బందులు గురి చేస్తుండటంతో సర్పంచ్ కుమారుడు కృష్ణ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రూ. 5000 లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం ట్రాప్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
రంగరాజ్ని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగినట్లయితే ఏసీబీకి తెలపాలని ఆయన తెలిపారు.