
మహారాష్ట్రలో తెలంగాణ పోలీసులపై దాడి…
web desc : మహారాష్ట్రలో తెలంగాణ పోలీసులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఓ నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్లో ఆదిలాబాద్ జిల్లా పోలీసులపై దాడి జరిగింది.
చిక్లి గ్రామంలో కరుడుగట్టిన షేక్ వకార్ అనే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
విధుల నిర్వహణలో తమపై దాడి చేసిన వారిపై ఆదిలాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు.




