AsifabadPoliticalTelangana

లంచం తీసుకుంటూ దొరికిపోయిన పంచాయితీ కార్యదర్శి...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన పంచాయితీ కార్యదర్శి...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన పంచాయితీ కార్యదర్శి…

కాగజ్‌నగర్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మెరుపు దాడి నిర్వహించారు.రూ.22 వేల లంచం తీసుకుంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి (జీపీఓ)ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో కార్యాలయంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. భూమికి సంబంధించిన పనిపై ఓ రైతు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించగా, ఆ పని చేసేందుకు జీపీఓ రూ.22 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. రసాయనం పూసిన నోట్లను బాధితుడి ద్వారా ఇప్పించి, సదరు ఉద్యోగి లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

దాడి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. లంచం వ్యవహారంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? గతంలోనూ ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు సమాచారం.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button