Khammam
Trending

ఇంటింటా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి షెడ్యూల్‌ విడుదల

ఇంటింటా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి షెడ్యూల్‌ విడుదల

ఇంటింటా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి షెడ్యూల్‌ విడుదల

ఏన్కూరు మండలంలోని 25 గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ.. ఆన్‌లైన్‌ నమోదు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 19 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటింటా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ఏన్కూరు మండలంలో అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ పథకానికి సంబంధించి గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా తేదీలను, బాధ్యతలు నిర్వహించే అధికారుల పేర్లను ఖరారు చేశారు.
మండలంలోని 25 గ్రామాల్లో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 20, 21 తేదీల్లో భగవాన్ నాయక్ తండా, సూర్యతండా, పీకే బంజర గ్రామాల్లో ప్రారంభం కానుంది. అనంతరం ములపోచారం, ఎర్రబోడు తండా, తిమ్మారావుపేట, రాజా లింగాల, రాయమాదారం, కోదండరామపురం, శ్రీరాంపురం, అరికాయలపాడు, బురద రాఘవాపురం, జన్నారం, రేపల్లెవాడ, గార్లఒడ్డు, నూకలంపాడు, భద్రుతండా, నాచారం, హిమాంనగర్, కేసుపల్లి, మెడేపల్లి, ఏన్కూరు తదితర గ్రామాల్లో నిర్ణీత తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు.
గ్రామాల వారీగా బాధ్యతలు నిర్వహించే సిబ్బందిని కూడా నియమించారు. సంబంధిత తేదీల్లో గ్రామాల ప్రజలు తమ దరఖాస్తుల సమర్పణకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు గ్రామాల వారీగా షెడ్యూల్‌ రూపొందించినట్లు తెలిపారు.
గ్రామాల వారీగా పూర్తి షెడ్యూల్‌:
గ్రామం
దరఖాస్తుల స్వీకరణ తేదీలు
1 భగవాన్ నాయక్ తండా నవంబర్ 20–21
2 సూర్యతండా నవంబర్ 20–21
3 పీకే బంజర నవంబర్ 20
4 కోదండరామాపురం నవంబర్ 21
5 రాయమాదారం నవంబర్ 20–21
6 ములపోచారం నవంబర్ 23–26
7 రాజా లింగాల నవంబర్ 23–26
8 ఎర్రబోడు తండా నవంబర్ 23–25
9 తిమ్మారావుపేట నవంబర్ 23–27
10 శ్రీరాంగిరి నవంబర్ 26–28
11 అరికాయలపాడు నవంబర్ 27–28
12 బురద రాఘవాపురం నవంబర్ 27 – డిసెంబర్ 1
13 కేసుపల్లి నవంబర్ 27–30
14 జన్నారం ఎస్టీ కాలనీ నవంబర్ 28–30
15 జన్నారం నవంబర్ 30 – డిసెంబర్ 2
16 తూటికలింగన్నపేట నవంబర్ 30 – డిసెంబర్ 5
17 నూకలంపాడు డిసెంబర్ 1–2
18 గార్లఒడ్డు డిసెంబర్ 3–5
19 రేపల్లెవాడ డిసెంబర్ 3–5
20 హిమాంనగర్ (ఈ) డిసెంబర్ 7–8
21 భద్రుతండా డిసెంబర్ 7–9
22 నాచారం డిసెంబర్ 7–9
23 గంగులనాచారం డిసెంబర్ 9
24 ఏన్కూరు డిసెంబర్ 2–10
25 మెడేపల్లి డిసెంబర్ 10

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button