పోక్సో కేసులో వ్యక్తికి కఠిన కారగార శిక్ష ….
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
ఫిబ్రవరి 27,
ఫోక్షో కేసులో వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అదనపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి (స్పెషల్ జడ్జి పోక్సో ) డాక్టర్ ఎమ్. శ్యామ్ శ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. మణుగూరు సర్వేంటు క్వార్టర్ కు చెందిన మైనర్ బాలిక పై సంతోష్ నగర్ మోతుకూరి వెంకటేశ్వర్లు 15-02-2021 న అసభ్యంగా ప్రవర్తించుటకు ప్రయత్నం చేశాడని,
మోతుకూరి వెంకటేశ్వర్లు అల్లుడు కొత్తూరి సందీప్ అసభ్యకరంగా తిట్టాడని మణుగూరు పి. ఎస్. లో మైనరు బాలిక 2021-02-24 న పిర్యాదు చేయగా అప్పటి ఇన్స్పెక్టర్ ఆర్. భాను ప్రకాష్ కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు అనంతరం కోర్టు లో చార్జ్ షీట్ దాఖాలు చేశారు. కోర్ట్ లో తొమ్మిది మంది సాక్షులను విచారించారు.
మోతుకూరి వెంకటేశ్వర్లు పై నేరo రుజువు కాగా, మోతుకూరి వేంకటేశ్వర్లు కు భారత శిక్షాస్మృతి 506 ప్రకారం 6 నెలలు, 5000/- జరిమానా మరియు 354-ఏ ప్రకారం ,ఒక సంవత్సరము కఠిన కారాగార శిక్ష 5,000/- రూపాయల మొత్తం పది వేల రూపాయలు జరిమాన వీదిస్తూ తీర్పు చెప్పారు, రెండు శిక్ష లు ఏక కాలంలో అనుభవించాలని తీర్పు చెప్పారు.
మోతుకూరి వెంకటేశ్వర్లు అల్లుడు కొత్తూరి సందీప్ పై నేరం రుజువు కాలేదని కేసు కోట్టివేశారు. ప్రాసిక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయ కుమార్ నిర్వహించారు. కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎమ్. హరి గోపాల్, కోర్టు డ్యూటీ ఆఫీసర్( కోర్టు పిసి) ఎమ్. అశోక్ లు సహకరిoచారు.