MuluguTelangana

అదుపుతప్పి గేటును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

అదుపుతప్పి గేటును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

అదుపుతప్పి గేటును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందురోడ్డు ప్రాంగణంలో ఉన్న గేటును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాతకు గురైన ద్విచక్ర వాహనదారుడు

వివరాల్లోకి వెళ్తే ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు (49) అనే వ్యక్తి ఏటూరునాగారం మండల కేంద్రం నుంచి, చినబోయినపల్లి గ్రామానికి వెళుతున్న క్రమంలో ఏటూరునాగారం ఐ.టి.డి.ఎ కార్యాలయం మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి గేటును ఢీకొట్టడంతో ప్రయాణదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు, అనంతరం ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న ఏటూరునాగారం పోలీస్ సిబ్బంది.

సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా ఇంతటి ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం అతివేగమే అయిఉండొచ్చని పోలీసుల అంచనా.? అనంతరం పోస్టుమార్టం కొరకు సంఘటన స్థలం నుంచి ఏటూరు నాగారం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే కోణంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button