అవినీతి ఆరోపణలతో మంథని సిడిపిఓ సరెండర్
సి కె న్యూస్ మంథని ఇంచార్జ్ జ్యోతి కుమార్ కన్నూరి మార్చి 1
మంథని నియోజక వర్గం ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారిణి పద్మశ్రీ పైన వచ్చిన పలు ఫిర్యాదులపైన ఉన్నతాదికారులు విచారణ జరిపి విచారణ అధికారులు ఇచ్చిన నివేదికల ఆదారంగా బుధవారం సిడిపివో పద్మశ్రీని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ డైరక్టర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమ్మిలాఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మంథని సిడిపివోగా 8 సంవత్సరాల నుండి ఇక్కడే విదులు నిర్వహిస్తున్న సిడిపివో పద్మశ్రీ పైన అనేక ఫిర్యాదులు గతంలో వచ్చినను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కాగా ఇటీవల ఇద్దరు సూపర్వైజర్లు జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదుతో సిడిపివోపైన విచారణ జరిపిన ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు రావటంతో పాటు ఆమె చేసిన అవినీతి వ్యవహారం బయటపడటంతో వారి నివేదిక ఆధారంగా కలెక్టర్ సిడిపివోను సరెండర్ చేశారు.
వివరాల్లోకి వెళితే మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ముత్తారం సెక్టార్ సూపర్వైజర్ స్వరూప కొంతకాలంగా విధులకు దూరంగా ఉన్నప్పటికీ సీడీపీవో పద్మశ్రీ అవినీతికి పాల్పడి ఆమెకు వేతనం చెల్లించారని కొందరు సూపర్వైజర్లు ఫిబ్రవరి 15న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని డీడబ్ల్యూఓ రవుఫ్ ఖాన్ కు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు డీడబ్ల్యూఓ రవుఫ్ ఖాన్ ఫిబ్రవరి 22న, వరంగల్ ఆర్జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి 26న వేర్వేరుగా విచారణ నిర్వహించారు. అధికారుల నివేదిక ఆధారంగా సీడీపీఓ పద్మశ్రీని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఇన్చార్జి సీడీపీవో గా వ్యవహ రించిన బి. రజిత (సూపర్వెజర్) ను వరంగల్ ఆర్జేడీ కార్యాలయానికి సరెండర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీడీపీఓ పద్మశ్రీ ఫిబ్రవరి 24నుంచి మార్చి 4 వరకు సెలవు పై వెళ్లారు. ఇన్చార్జి సీడీపీఓ గా ఉన్న రజిత ఉన్నతాధికారులకు తెలియకుండా కార్యాల యానికి సంబంధించిన సమాచారాన్ని బయట వ్యక్తులకు వెల్లడించారనే కారణంతో ఆమెపై కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే ఇన్ చార్జి సీడీపీఓ తో కలిసి కార్యాలయ సమాచారాన్ని బయటికి వ్యక్తులకు వెల్లడిం చడంలో సహకారం అందించిన సరితాదేవి అనే మరో సూపర్ వైజర్ కు షోకాజ్ నోటీసులు అందజేశారు. ఇదిలా ఉంటే డైరెక్టరేట్ కు సరెండర్ చేసిన సీడీపీవో పద్మశ్రీపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
గత 8సంవత్సరాలు అప్పటి అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో కిందిస్థాయి సిబ్బంది నుండి వసూళ్లకు పాల్పడుతూ మెమోస్ ఇస్తానని బెదిరింపులు చేస్తూ అంగన్వాడి టీచర్లను మరియు ఆయాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన సిడిపివోను రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేయటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.