పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం….
గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతు న్నాయి. నిమిషం నిబంధ నల వల్ల కొంత మంది విద్యార్థులు పరీక్ష రాయ లేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రానికి ముందుగా వెళ్లా లన్న తొందరలో.. పలువురు విద్యార్థులు బైకుల మీద వెళ్తూ ప్రమాదానికి గురవు తున్నారు.
ఈరోజు మార్చి 1న కూడా ఓ విద్యార్థిని పరీక్షకు వెళ్తూ ప్రమాదానికి గురైంది. ప్రమా దంలో విద్యార్థినికి తీవ్ర గాయాలవగా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు మానవ త్వాన్ని చాటుకున్నాడు.
అయితే.. తలకు అయిన తీవ్ర గాయంతోనే విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్లటం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసేందుకు నగరానికి చెంది న ఓ విద్యార్థిని తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది.
అయితే.. సికిం ద్రాబాద్ ఎంజీ రోడ్ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బండి అదుపుతప్పడంతో వాళ్లు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు తీవ్ర గాయాల య్యాయి.
అక్కడే విధులు నిర్వహి స్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉపాశంకర్.. ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే స్పందించారు. ఆ విద్యార్థి నిని తన వాహనంలోనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి.. ప్రథమ చికిత్స చేయించారు.
ఆసుపత్రికి తీసుకెళ్లే ముందే.. ఆ విద్యార్థిని వెళ్లాల్సిన పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్‌కు ప్రమాద సమాచారం అందించి.. అనుమతి తీసుకున్నారు.
కాగా.. విద్యార్థిని తలకు బలమైన గాయం కావ టంతో.. ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినిని మళ్లీ తన వాహనంలోనే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు
ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపా శంకర్. అది కూడా సరైన సమయానికే. ఆ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చేసిన సాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. అంత బలమైన గాయం తగిలినా.. నొప్పి తోనే పరీక్ష రాసేందుకు వెళ్లింది విద్యార్థిని……