కేటీఆర్.. ఇద్దరం రిజైన్ చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామా : మంత్రి వెంకట్‌రెడ్డి
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. ”నేను నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను..దమ్ముంటే కేటీఆర్సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి..
ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామా” అని సవాల్ చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి శుక్రవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిని సవాల్‌చేసే స్థాయి కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు.
కేటీఆర్సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారని అక్కడే పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామన్నారు. మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్రూ.200 కోట్లు ఖర్చు పెట్టి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడని చెప్పారు.
అంత తక్కువ మెజార్టీతో గెలిస్తే తనైతే రాజీనామా చేసే వాడినని తెలిపారు. ఇప్పుడు సిరిసిల్లలో ఇద్దరం పోటీ పడితే తనే గెలుస్తానని అన్నారు. కేటీఆర్ఓడిపోతే పార్టీని క్లోజ్చేస్తానని కేసీఆర్‌తో ప్రకటన చేయిస్తారా అని ప్రశ్నించారు.
తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ”నిజానికి కేటీఆర్‌ది నా స్థాయి కూడా కాదు.
కేటీఆర్‌కు టెక్నికల్నాలెడ్జ్లేదు, చిన్న పిల్లగాడు. ఆయనకు క్యారెక్టర్లేదు, లక్షల కోట్లు మాత్రమే ఉన్నయి. నా దగ్గర డబ్బు లేదు.. క్యారెక్టర్ మాత్రమే ఉంది’ అని అన్నారు.