భువనగిరి పార్లమెంట్ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి
-యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పలపల్లి మహేష్
సికే న్యూస్ అడ్డగూడూరు ప్రతినిధి(రాజు)ఫిబ్రవరి05:
భువనగిరి పార్లమెంట్ టికెట్ రాష్ట్ర టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు చిప్పలపల్లి మహేష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు.
మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేకపోయినా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటూ ఎవరికి, ఏ కార్యకర్తకు ఆపద కలిగినా నేనున్నానంటూ తనదైన శైలిలో సహాయం చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడరు కాపాడుతూ ప్రతి కార్యకర్త గుండెల్లో ముద్ర వేసుకున్న ఘనత చామల కిరణ్ కుమార్ రెడ్డిదని అలాంటివారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినట్లైయితే పార్లమెంటు నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని, అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి సమర్థుడైన కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. అలాగే వారికి ఏడు నియోజకవర్గాలపై పట్టుండడం వారికి టిక్కెట్ ఇస్తే ముమ్మాటికి గెలవడం ఖాయమని అన్నారు.