మహా శివరాత్రి సందర్భంగా పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకములు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 06
లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి క్షేత్రమునకు అనుబంధముగా ఉన్న శ్రీ పార్వతీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు తేదీ:08-03- 2024 శుక్రవారము రోజున మహా శివరాత్రి సందర్భముగా ఉదయం నుండి అభిషేకములు మరియు విశేష అర్చనలు నిర్వహింపబడునని సాయంత్రం గం 7-00లకు దేవస్థాన అర్చకులచే శాస్త్రోత్తమముగా శ్రీ పార్వతీరామలింగేశ్వర స్వామి వారల కళ్యాణం (తలంబ్రాలు) అత్యంత వైభవముగా జరుగును. తదుపరి రాత్రి గం 11–30లకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు మరియు లింగోధ్భవ కాల అభిషేకములు జరుగును. ఇట్టి కార్యక్రమమునకు విచ్చేయు భక్తుల సౌకర్యార్ధం స్థానిక శివాలయములో క్యూలైన్స్, ప్రసాదముల వితరణ మరియు ఇతర ఏర్పాట్లు చేయబడినవి. ఇట్టి కార్యక్రమములలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి కృపకు పాత్రులుకాగలరని దేవాలయ అనువంశిక ధర్మకర్తలు చైర్మన్ చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్ దేవస్థాన పాలకవర్గము, మరియు కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ వారలు తెలియజేసారు.