ఇందిరమ్మ ఇండ్ల లో దివ్యాoగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
గాయం గోవార్ధన్ రెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 07
స్వంత ఇల్లు లేక మండలంలోని అనేకమంది వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని గాయం గోవార్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలలో మార్పులు చేసి అర్హులైన ప్రతి వికలాంగునికి మొదటిదశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించాలని.స్వంత స్థలం ఉన్న అందరికీ మొదటి విడతలో ఇండ్లు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మండలంలోని వికలాంగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అంగవైకల్యం కారణంగా సమాజంలో నిత్యం వివక్షకు గురయ్యే వీరి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు