రేవంత్ అన్న అని పిలిచి మహిళ.. సీఎం ఏం చేశారంటే..
మంత్రులకే కాదు ప్రజలకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారంటూ గట్టి సంకేతాలు పంపారు. అయితే.. ముఖ్యమంత్రి అంటే ముందు పది మంది, వెనుక పది మంది పోలీసులు, చుట్టూ పదుల సంఖ్యలో నేతలు ఉంటారు.
సీఎం ఎక్కడికైనా వస్తున్నారంటే కనీసం గంట ముందే ఎక్కడికక్కడ కట్ బంద్ చేస్తారు. కనీసం ఆయన్ను కలవాలంటే కూడా సాధ్యపడదు.
ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం కూడా దొరకదు. కానీ.. అప్పుడూ సీఎం అంటే అలా ఉండేదేమో కానీ.. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చాడు. నువ్వు నన్ను అన్నా అని పిలిస్తే క్షణాల్లో మీ ముందుకు వస్తాను అనే మాటను సీఎం అయినా ఆయన నిరూపించుకున్నారు.
ఏదో సినిమాలో హీరో చెప్పినట్లే.. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును ఇప్పుడు అందరూ బ్యాడ్ సీఎంగా భావిస్తున్నారు. ఢిల్లీ రాజు అంటే తల్లీకొడుకులాగా.. రాష్ట్రానికి సీఎం అయినా సామాన్యులకు అన్ననే.. అన్నా.. అని పిస్తే చాలు మీ ముందుకు నేనే వస్తా అంటూ చెప్పిన మాటలు నిరూపించారు.
మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేసీఆర్ ను కలిసి పరామర్శించి తిరిగి వెళ్లుతున్న క్రమంలో ఓ యువతి రేవంత్ అన్నా.. అంటూ పిలవగానే అంతమందిలో వున్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆమె వైపు చూసారు.
రేవంత్ అన్నా నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది..” గద్గద స్వరంతో ఆ అమ్మాయి గొంతు విని క్షణాల్లో ఆమె వద్దకు చేరుకున్నాడు. ఏమైందని ఆమె ప్రశ్నించగా.. తన తండ్రి ఆస్పత్రిలో చేరారని.. ఒక్కరోజులో లక్షన్నర బిల్లు వేశారని.
నువ్వే ఆదుకోవాలంటూ.. యువతి సీఎం ఎదుట గోడు వెళ్లబోసుకుంది. దీంతో వెంటనే తనతోపాటు ఉన్న అధికారులను పిలిచి ఏం జరిగిందో తెలుసుకుని అవసరమైన సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. బాధపడకు తల్లీ.. ధైర్యంగా ఉండాలని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అంటే కేవలం ఆయన అభిమానులు మాత్రమే. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నువ్వు సూపర్ అన్నా.. దటీజ్ రేవంత్ అన్నా.. అంటూ ఆయన అభిమానులు అరుస్తున్నారు. రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ సామాన్యులకు రేవంత్ అన్నే అంటున్నారు.