ఉపాధి హామీ పనులను సందర్శించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు…..
వ్యవసాయ కార్మిక సంఘం కుటుంబానికి 12000 రూపాయలు ఇవ్వాలి…జూకంటి పౌల్
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 11
ఆలేరు మండలంలోని గుండ్ల గూడెం గ్రామంలో ఉపాధి హామీ పనుల దగ్గర సందర్శించి వ్యవసాయ కార్మిక సంఘం కుటుంబానికి 12000 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ డిమాండ్ చేశారు..
ఆ గ్రామంలో ప్రజాసంఘాల సభ్యత్వానికి సోమవారం రోజు ఆయన ప్రారంభించి మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని మేరకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.కరువుతో పంటలు నష్టపోతున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతన్న పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ పై ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు 100 రోజుల నుంచి 200 రోజుల వరకు కల్పించాలన ఈ విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం చట్టాన్ని సవరించి కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ మిట్ట శంకరయ్య,వీర సారపు చంద్రయ్య,సోమిరెడ్డి,దూసరి మల్లమ్మ,ఎదునూరు సోములు,గుగులోతు రేణుక,ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక తదితరులు పాల్గొన్నారు…