శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 11
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేక ఆశీర్వచనం అందజేసారు.ఆలయ అధికారులు ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అధికారులతో కలసి మాట్లాడారు..
ఆ తర్వాత మండలంలోని సైదాపూర్ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అక్కడ నుండి సైదాపూర్ సొంత గ్రామంలో ప్రజలను కలసి ఆత్మీయంగా మాట్లాడారు.యాదగిరిగుట్ట కు చేరుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను,అభిమానులను కలసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.