పాలేరు నీటి తరలింపునకు
రైతుల యత్నం
అడ్డుకున్న అధికారులు, పోలీసులు
కాల్వ తవ్వుతున్న పొక్లెయినర్
పాలేరు రిజర్వాయర్ నీటి చోరీ….
భారీగా కాలువలు తవ్వి తరలింపు
డెడ్ స్టోరీకి వెళ్ళిన నీటి మట్టం
లోతట్టు శికం భూముల ఆక్రమణదారుల నీటి చోరిపై మాట్లాడని అధికారులు
భారీ యంత్రాలతో నీటి మళ్లింపు
తాగునీటికే పరిమితం అంటున్న ఇరిగేషన్ అధికారులు
అమ్యమ్యాలతో అటువైపు చూడడం లేదని చెబుతున్న స్థానికులు….
నిజమైన రైతుల అందని సాగు నీరు
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వా యర్ నుంచి కొందరు రైతులు అక్రమంగా తమ పొలాలకు తరలించే ప్రయత్నం చేస్తుండ గా జలవనరులశాఖ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు.
గ్రామానికి చెందిన కొందరు రైతులు నవోదయ విద్యాలయ వెనుక ఉన్న పొలాలు, బావులకు రిజర్వాయర్ నీటిని తర లించేందుకు సోమవారం పొక్లెయినర్తో కాల్వ తవ్వకం మొదలుపెట్టారు.
ఈ విషయాన్ని స్థానికులు జలవనరులశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఈఈ మంగళంపూడి వెం కటేశ్వర్లు, ఎస్సై కిరణ్కుమార్ తదితరులు చేరుకున్నారు. పొక్లెయినర్ను పోలీసుస్టేషన్కు తరలించగా.. నీటి తరలింపుకు పాల్పడిన రైతులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉందని తెలి పారు. రైతులు నీటిని అక్రమంగా తరలించే ప్రయత్నాలు చర్యలు తప్పవని పేర్కొన్నారు