శ్రీ చైతన్య టెక్నో స్కూల్ INTSO లో విద్యార్ధుల ప్రతిభ
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో తమ ప్రతిభతో ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది.
ఐదుగురు విద్యార్థులు టాబు, స్మార్ట్ వాచ్ లు, 41 కన్సోలేషన్ బహుమతులు, స్పెషల్ ప్రైజులు 6 గెలుచుకోవడం జరిగింది.
SK హయ్యుబ్ ఫస్ట్ ప్రైజ్ విజేత లెనోవా టాబ్ గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ గెలుచుకున్నాడు. ముగ్గురు విద్యార్ధులు 3 హ్యాండ్ వాచ్ లు, గోల్డ్ మెడల్స్ , సర్టిఫికెట్స్, ఒకరు రెడ్ బోల్ బ్యాక్ బ్యాగ్ ను గెలుచుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్ధులలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈ టాలెంట్ పరీక్షలు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య కరికులంతో విద్యార్థులు ఎన్నో బహుమతులు గెలవడం సంతోషంగా ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య , పాఠశాల ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నివేదిత, 25 . సి ఇన్చార్జి శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.