గ్రామాల్లో అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి:డా పీటర్ నాయక్ లకావత్
ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం గొర్రెలపాడు తండా పరిధిలోని
చాంప్లా తండా అంగన్వాడీ కేంద్రం లో ఈ నెల 9 నుంచి 23 వరకు జరుగు పోషణ పక్షం వేడుకలో బాగంగా ముఖ్య అతిధిగా డా పీటర్ నాయక్ లకావత్ పాల్గొని స్థానిక అంగన్వాడీ పరిధిలో గల మహిళలు పిల్లలకు ఆరోగ్య విషయంలో అవగాహన కలిపిస్తూ, మన పూర్వికులు సంప్రదాయ బద్దంగా ఆకుకూరలు, జొన్నలు, ఉలువలు, మొక్క జొన్న, పప్పు కూరగాయలు అధికశాతం కూరగాయలు తిని దృడంగా ఉండేవాళ్ళన్నారు పిల్లలకు పాలు, గుడ్లు ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్న పౌష్టిక ఆహారమును గర్భిణీ స్త్రీలు, బాలింతలు చిన్న పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
అంగన్వాడీ కేంద్రములో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలు తీసుకోవలసిన పోస్టిక ఆహారం గురించి కల్పించారు
అనంతరం అంగన్వాడీ టీచర్ బానోతు కవిత మాట్లాడుతూ పోషణ పక్షం వేడుకల్లో భాగంగా ప్రతిఒక్క గర్భిణీ స్త్రీలు ,బాలింతలు, చిన్న పిల్లలకు సంప్రదాయ పరంగా వస్తున్న చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనారోగ్య భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటితో పాటు నేటి నుండి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తామని అంగన్వాడీ కేంద్రం,మరియు పెద్దల సలహాలు సూచనలు తప్పక పటిస్తామని పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డా పీటర్ నాయక్ లకావత్ పాటు అంగన్వాడీ ఉపాధ్యాయురాలు బాణోత్ కవిత
తేజవత్ కిషన్, తేజవత్ వెంకటేష్, బానోతు శ్రీనివాస్ రావు, బానోతు రాజేష్ నాయక్, బానోతు వెంకట్రాం నాయక్, భూక్యా బిక్ష్యం,పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.