ములుగు జిల్లాలో మూగబోయిన జర్నలిజం.!
“చిన్న గాలి వానకే గుంపులు కట్టే ఈ జనం” ప్రజల సమస్య పట్ల ఎందుకు గుట్టుగా తిరుగుతున్నారు,!”
“జరిగిన సంఘటన మీడియా దృష్టి దాకా చేరలేదా.! లేక’? వార్తను ఆపడానికి …. అదే.? కారణమా.!”
“ములుగు జిల్లాలో మీడియాపై వస్తున్న పలు రకాల ఆరోపణలు నిజమే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు పలు మండల మీడియా పాత్రికేయ కళా పోషకులు.!”
మృతురాలి కుటుంబం మృతి పట్ల ఆరోపిస్తున్న, నిందితులకు ప్రముఖ మీడియా పల్లకి మోస్తుందా.?
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనపై, సప్పుడులేని మీడియా అని ‘ సోషల్ మీడియాలో పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు సాహితి మృతి పట్ల ఆరోపిస్తున్న అంశాలు నిజమేనా.? సుంకరి. సాహితి కి, చిడెం. హరీష్ కి ఇంతకుముందే పరిచయం ఉన్నది అని కుటుంబ సభ్యులలో ఒకరైన మరిది వెల్లడించిన మాటలను బట్టి గతాన్ని వెలికితీసే కోణంలో ప్రయత్నిస్తే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది అంటూ పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఆలోచనలో లీనమయ్యారు.
ఇద్దరిదీ వెంకటాపురం మండలమే అయినందున సాహితికి, హరీష్ కి, చిన్ననాటి పరిచయాలు ఉన్నాయా.? లేక కాలేజీ సమయం నుంచే వీళ్ళు పరిచయం ఏర్పడిందా.! ఒకవేళ కాలేజీ సమయం నుంచే వీళ్ళకి పరిచయాలు పెరిగితే, సాహితీ కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాల పరిస్థితి ఏంటి.? చిడెం. మోహన్ రావు. సుంకరి. వెంకట సుబ్బారావు. ఇద్దరు మంచి స్నేహితులని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాలలో కూడా ఎంతో ముమ్మారంగా కలిసి పాల్గొనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం, పిల్లలేనా కారణం.! చిడెం. మోహన్ రావు. చిడెం. హరీష్ ల పట్ల సాహితి కుటుంబ సభ్యులు. ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు’ సైబర్ డిపార్ట్మెంట్ వెల్లడించే ఆధారాలపై కేసు ఆధారపడి ఉందని చైతన్య పూరి పోలీసులు తెలిపినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా చిన్న గాలివానకే”గుంపులు కట్టే” ఈ మీడియా / మహిళకు అన్యాయం జరిగిందని సాహితి మృతదేహంతో మాకు న్యాయం చేకూర్చాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డును ఆశ్రయిస్తే’ ములుగు జిల్లాలో తూ, తు, మంత్రంగా వార్తను సేకరించిన పాత్రికేయ బృందం, ప్రశ్నించే గళం మూగబోతే” ప్రజల గోడు ప్రభుత్వానికి అర్థమయ్యేది ఎలా అంటూ ప్రజాస్వామ్యంలో పలు రూమర్స్ వెలివెత్తుతున్నాయి.